Nithiin Reunites with Sithara Banner: మళ్ళీ సితార బ్యానర్‌లో నితిన్.. రితికా నాయక్ హీరోయిన్‌గా

రితికా నాయక్ హీరోయిన్‌గా

Update: 2026-05-07 07:43 GMT

Nithiin Reunites with Sithara Banner: వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో జోరుమీదున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, యువ హీరో నితిన్తో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. కొద్దిపాటి విరామం తర్వాత నితిన్ నటిస్తున్న ఈ సరికొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. : నారి సిరిసవాడ, సోమశేఖర్ టి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. 'మిరాయ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా నాయక్ ఇందులో నితిన్ సరసన కథానాయికగా నటిస్తోంది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారు. అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. జానీ షేక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మే రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఒక పక్కా ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Tags:    

Similar News