“Dhurandhar 2” Climax Shot: గ్రాఫిక్స్ కాదు రియల్.. 500 లీటర్ల పెట్రోల్ తో ధురంధర్ 2 క్లైమాక్స్

500 లీటర్ల పెట్రోల్ తో ధురంధర్ 2 క్లైమాక్స్

Update: 2026-04-30 05:32 GMT

“Dhurandhar 2” Climax Shot: స్టార్ హీరో పవర్‌ఫుల్ విలన్.. వెన్నులో వణుకు పుట్టించే క్లైమాక్స్. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2' థియేటర్లలో సరిగ్గా ఇదే మ్యాజిక్‌ను రిపీట్ చేసింది. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో సినిమా క్లైమాక్స్ ఒక రణరంగాన్ని తలపించింది. అయితే ఈ సీన్స్ చూస్తున్నప్పుడు మనం గ్రాఫిక్స్ అని అనుకుంటాం.. కానీ ఈ విజువల్స్ వెనుక ఉన్నది ప్యూర్ రియాలిటీ!

ఈ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ విశాల్ త్యాగి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. క్లైమాక్స్‌లో వచ్చే భారీ పేలుళ్ల కోసం చిత్ర బృందం గ్రాఫిక్స్‌పై ఆధారపడలేదు. "ఫైర్ సీన్స్ కోసం సీజీఐ (CGI) వద్దు.. అన్నీ రియల్‌గా ఉండాలి" అని దర్శకుడు ఆదిత్య ధర్ ముందే కండిషన్ పెట్టారట. దీంతో ఏకంగా 500 లీటర్ల పెట్రోల్‌ను ఉపయోగించి ఆ భారీ బ్లాస్ట్‌లను చిత్రీకరించారు. రణ్‌వీర్ సింగ్ ప్రాణాలకు రిస్క్ ఉందని తెలిసినా.. పక్కా ప్లానింగ్‌తో, సెగ తగలకుండా ఈ సీక్వెన్స్‌ను కంప్లీట్ చేశారు.

నిజానికి ప్రొడక్షన్ టీమ్ కేవలం 250 లీటర్ల పెట్రోల్ మాత్రమే వాడాలని సూచించింది. కానీ, అవుట్‌పుట్ అదిరిపోవాలంటే 500 లీటర్లు కావాల్సిందేనని విశాల్ త్యాగి పట్టుబట్టారు. దానికి తోడు 25 కేజీల గన్‌పౌడర్ కూడా వాడటంతో క్లైమాక్స్ విజువల్స్ వెండితెరపై అద్భుతంలా ఆవిష్కృతమయ్యాయి. షూటింగ్ పూర్తయ్యాక రణ్‌వీర్ సింగ్ స్వయంగా స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్‌ను దగ్గరకు తీసుకుని మెచ్చుకున్నారంటే, ఆ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మార్చిలో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. దాదాపు 1800 కోట్ల రూపాయల భారీ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటింది.

Tags:    

Similar News