NTR Movie:మామూలుగా లేదు..2 వేల మందితో యాక్షన్ సీన్

2 వేల మందితో యాక్షన్ సీన్;

Update: 2025-06-06 04:21 GMT

NTR Movie:ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హైద‌‌‌‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌‌‌‌రుగుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌పై కీల‌‌‌‌క స‌‌‌‌న్నివేశాలు షూట్ చేస్తున్నారు. రెండు వేల మంది జూనియ‌‌‌‌ర్ ఆర్టిస్టుల మ‌‌‌‌ధ్యలో తార‌‌‌‌క్ ఉన్న సీన్స్‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో 31వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్‌‌‌‌’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌‌‌‌‌‌‌‌తో కనిపించనున్నాడు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌‌‌గా, టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌‌‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.

Tags:    

Similar News