NTR Tries Baking Cookies: ఫస్ట్ టైమ్ కుకీస్ బేక్ చేసిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Update: 2026-06-06 11:16 GMT

NTR Tries Baking Cookies: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌కు వంట చేయడం అంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు రకరకాల వంటకాలు చేస్తుంటానని ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల కోసం బిర్యానీ, మటన్ కర్రీ వంటి ట్రెడిషనల్ ఇండియన్ డిష్‌లను ఎన్టీఆర్ అద్భుతంగా వండుతారు. అయితే, ఇప్పటివరకు వంటలకే పరిమితమైన తారక్.. తాజాగా సరికొత్తగా బేకింగ్‌పై చేతులు పెట్టారు.

తన జీవితంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ కుకీస్ బేక్ చేయడానికి ట్రై చేశారు. ఇంట్లోనే స్వయంగా తయారు చేసిన కుకీస్ బేకింగ్ ట్రేపై చల్లారుతున్న ఒక వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. దీనికి "మై ఫస్ట్ బేక్.. #BakedNotBought" (నేనే స్వయంగా బేక్ చేశాను, కొన్నది కాదు) అంటూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టారు.

వెండితెరపై పవర్‌ఫుల్ యాక్షన్‌తో అలరించే తమ హీరోలో ఉన్న ఈ సరికొత్త సాఫ్ట్ యాంగిల్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ ఏకంగా బిర్యానీ వండటం పక్కన పెట్టి బిస్కెట్లు చేయడం మొదలుపెట్టారా అంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరైతే మాకు కూడా కొన్ని కుకీస్ పంపించండి అంటూ ప్లేఫుల్‌గా రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.

అభిమానుల హడావుడిని చూసి ఎన్టీఆర్ కూడా అంతే సరదాగా స్పందించారు. బ్రహ్మానందం, పరేష్ రావల్‌కు సంబంధించిన కొన్ని ఫన్నీ మీమ్ క్లిప్స్‌ను రిప్లైగా పెడుతూ సోషల్ మీడియాలో నవ్వులు పూయించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న "డ్రాగన్" (Dragon) సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News