Official Update on OG 2: OG 2 అఫీషియల్ అప్‌డేట్ .. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

Update: 2026-06-12 01:56 GMT

Official Update on OG 2: బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ అంటే ఏంటో చూపించిన సినిమా... పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రేంజ్‌కు పర్ఫెక్ట్ మీటర్ పడితే ఎలా ఉంటుందో నిరూపించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా... 'ఓజీ' (They Call Him OG) దర్శకుడు సుజీత్ ప్రెజెంటేషన్, పవర్‌స్టార్ ఊరమాస్ లుక్స్, బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే ఒక సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చేసింది.

ఓజీ' సినిమా థియేటర్లలో సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. అయితే, ఆ కథ అక్కడితో అయిపోలేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ 2' గురించిన అఫీషియల్ హింట్ బయటికి వచ్చేసింది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్‌ను పంచుకుంది. "వాగ్దానం చేసినట్లు ఆయన చేస్తున్నాడు. ఎప్పుడనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయి" అంటూ 'ఎక్స్' (Twitter) లో ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. దాంతో సోషల్ మీడియాలో #OG2 హ్యాష్ ట్యాగ్ మార్మోగిపోతోంది.

నిజానికి దర్శకుడు సుజీత్, 'ఓజీ' మొదటి భాగంలోనే రెండో భాగానికి సరిపడా ఎన్నో సర్‌ప్రైజ్‌లను, హింట్స్‌ను వదిలిపెట్టారు. సినిమా ప్రమోషన్స్ సమయంలోనే... అన్నీ కుదిరితే ఖచ్చితంగా పార్ట్-2 ఉంటుందని హింట్ ఇచ్చారు. అంతకంటే ముఖ్యంగా, స్వయంగా పవన్ కల్యాణే గతంలో ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ రెండు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రకటించి ఫ్యాన్స్‌లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. అంటే, ఓజీ కథ వెనకాల ఉన్న అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి? బాంబేను ఓజీ ఎలా రూల్ చేశాడు? అనే ప్రీక్వెల్ గానీ, లేదా ఆ తర్వాత ఏం జరిగిందనే సీక్వెల్ గానీ రాబోతోందన్నమాట.

అయితే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేదే ఇప్పుడు అందరి మైండ్‌లో ఉన్న ప్రశ్న. ప్రస్తుతం దర్శకుడు సుజీత్, నేచురల్ స్టార్ నాని హీరోగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత, సుజీత్ విదేశాల నుండి తిరిగి రాగానే 'ఓజీ 2' కి సంబంధించిన అధికారిక చర్చలు, స్క్రిప్ట్ వర్క్ వేగం పుంజుకోనున్నాయి. నాని సినిమా పూర్తి కాగానే, పవర్‌స్టార్‌తో సుజీత్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News