OG Box Office Collection: ఓజీ బాక్సాఫీస్..13 రోజుల్లో ఎన్ని కోట్లంటే.?
13 రోజుల్లో ఎన్ని కోట్లంటే.?
OG Box Office Collection: పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' (They Call Him OG) మొదటి రోజు రూ.154 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే..11 రోజుల్లో రూ. 308 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే 13 వ రోజూ కూడా ఈ సినిమాకు నెట్ వసూళ్లు వస్తున్నాయి.
13వ రోజ నెట్ కలెక్షన్ సుమారు రూ. 1.40 కోట్లు (Sacnilk నివేదిక ప్రకారం) వచ్చాయి. దీంతో మొత్తం 13 రోజుల్లో నెట్ కలెక్షన్లు సుమారు రూ. 185.85 కోట్లు వచ్చాయి. ఓజీ మొత్తం 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్త గ్రాస్ సుమారు రూ.312 కోట్లు వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓజీ' 2025లో అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఓజీ ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా థియేట్రికల్ విడుదలై నాలుగు వారాలు పూర్తయిన వెంటనే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.