‘OG’ to Stream on OTT: నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి 'OG' - ఎక్కడంటే?
ఓటీటీలోకి 'OG' - ఎక్కడంటే?
‘OG’ to Stream on OTT: బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'OG' (They Call Him OG), విడుదలైన నెల రోజులు తిరక్కుండానే ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది.స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ నటన, ఎస్.ఎస్. థమన్ అందించిన హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయానికి కీలకంగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించి మెప్పించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన వారు, లేదా మరోసారి చూడాలనుకునే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఓటీటీ విడుదల నిజంగా 'గోల్డెన్ ఛాన్స్' అని చెప్పవచ్చు. విడుదలైన కేవలం నాలుగు వారాల్లోనే ఈ చిత్రం డిజిటల్ వేదికపైకి రావడం విశేషం.