OG Trailer Review: ఓజీ ట్రైలర్ రివ్యూ.. అరాచకం అంతే..

అరాచకం అంతే..

Update: 2025-09-23 05:36 GMT

OG Trailer Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఎప్పటి నుంచో అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని మొదట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రదర్శించిన తర్వాత, సోమవారం (సెప్టెంబర్ 22, 2025) మధ్యాహ్నం అధికారికంగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ రిలీజ్ అయిన 19 గంటల్లో 8.5 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.

ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్స్, ఫైట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఎస్.ఎస్.తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్‌కు హైలెట్ గా నిలిచింది.

పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ సుజీత్ అలాగే చూపించారని ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించగా, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News