OG Trailer: సెప్టెంబర్ 21న పవన్ ఫ్యాన్స్ కు పండగే

పవన్ ఫ్యాన్స్ కు పండగే

Update: 2025-09-19 10:13 GMT

OG Trailer: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 21న సెలబ్రేషన్స్ కు రెడీగా ఉండండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఓజీ ట్రైలర్ రిలీజ్ కానుంది. అవును ఓజీ ట్రైలర్ ను సెప్టెంబర్ 21న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్టు సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కానున్న నేపథ్యంలో, అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది.

ఓజీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు, గ్లింప్స్ సినిమాపై హైప్ పెంచాయి. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. దాదాపు 10కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. నిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా జరిగిందని, నైజాం హక్కులు మాత్రమే రూ. 60 కోట్లు పలికాయని సమాచారం. మొత్తం సినిమా బిజినెస్ దాదాపు రూ. 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News