OG Movie: ఓజీ నుంచి ట్రాన్స్ ఆఫ్ ఓమీ..దుమ్ములేపిందిగా...

దుమ్ములేపిందిగా...

Update: 2025-09-12 06:45 GMT

OG Movie: పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా నుంచి బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పోషించిన 'ఓమి' పాత్రకు సంబంధించిన "ట్రాన్స్ ఆఫ్ ఓమి" అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ట్రాన్స్ ఆఫ్ ఓమి అనే ఈ పాట ఆయన పాత్రకు సంబంధించిన థీమ్ సాంగ్. ఈ పాటలో అతని పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూపించారు. ఈ పాట మ్యూజికల్ గా, విజువల్స్ పరంగా చాలా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ మధ్య ఉండే ఒక ఫైట్ సీన్‌ను ఇందులో సూచించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో ఇమ్రాన్ హష్మీ వంటి బాలీవుడ్ నటుడు విలన్‌గా నటించడం సినిమాకు ఒక అదనపు ఆకర్షణగా మారింది. ఈ పాట చూసిన తర్వాత అతని పాత్రపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'ఓజీ' గ్లింప్స్‌కు కూడా అద్భుతమైన టాక్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన స్టైల్, నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.దర్శకుడు సుజీత్ 'సాహో' సినిమా తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన మేకింగ్ స్టైల్ , భారీ విజువల్స్‌తో ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌గా ఉండవచ్చని టాక్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు,పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి, ఇది సినిమా క్రేజ్‌కు నిదర్శనం.ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News