‘Pathang’ Trailer: ఎనర్జిటిక్‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌గా పతంగ్ ట్రైలర్

పతంగ్ ట్రైలర్

Update: 2025-12-16 04:27 GMT

‘Pathang’ Trailer: ప్రీతి ప‌‌గడాల, ప్రణవ్ కౌశిక్‌‌, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో ప్రణీత్ ప్రత్తిపాటి రూపొందించిన చిత్రం ‘పతంగ్’. సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో విజ‌‌‌‌‌‌‌‌య్ శేఖ‌‌‌‌‌‌‌‌ర్ అన్నే, సంప‌‌‌‌‌‌‌‌త్ మ‌‌‌‌‌‌‌‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.

తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌ ఎంతో ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఇదొక కొత్తరకమైన సినిమా. సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఉంది. లవ్‌‌‌‌‌‌‌‌ ఉంది. గ్రేట్‌‌‌‌‌‌‌‌ మ్యూజికల్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ఉంది. ఆర్టిస్టులు అందరూ ఎంతో ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ప‌‌‌‌‌‌‌తంగుల పోటీతో రాబోతున్న ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామా అందర్నీ ఆకట్టుకుంటుందని నటులు వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌‌‌‌‌‌‌‌ మోపిదేవి, నాని బండ్రెడ్డి, సంపత్ మకా, సహ నిర్మాత రమ్య వేములపాటి పాల్గొన్నారు.

Tags:    

Similar News