Pawan Kalyan Back in Front of the Camera Again: మళ్ళీ కెమెరా ముందుకు పవన్ .. ఏప్రిల్ నుండి షూటింగ్!

ఏప్రిల్ నుండి షూటింగ్!

Update: 2026-02-09 08:14 GMT

Pawan Kalyan Back in Front of the Camera Again: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, తన సినీ ప్రయాణాన్ని కూడా సమాంతరంగా కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 2026 నుండి ఆయన తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు.

రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ సినిమాకు 'ఖాదర్ భాయ్' (Khadar Bhai) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

తన రాజకీయ విధులకు ఆటంకం కలగకుండా, పవన్ కళ్యాణ్ ప్రతి నెలా కొన్ని రోజులను మాత్రమే షూటింగ్‌కు కేటాయించనున్నారు. సురేందర్ రెడ్డి సినిమాను 6 నుండి 7 నెలల్లోపు పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 26న విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రమోషన్స్‌లో కూడా పవన్ చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. దీంతో 2026 సంవత్సరం పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది.

Tags:    

Similar News