Pawan Kalyan Birthday Special: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులకు దర్శకుడు సుజీత్ ఊహించని కానుక అందించారు. ఓజీ యూనివర్స్ పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, రాబోయే ‘ఓజీ’ సీక్వెల్‌పై సుజీత్ చేస్తున్న భారీ సన్నాహాలను ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు.

వీడియోలో ఆకట్టుకున్న చర్చలు

ఈ వీడియోలో పవన్ కల్యాణ్‌తో కలిసి దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్ జరిపిన కథా చర్చలు సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ‘‘భారతీయ మూలాలు.. సౌత్ ఈస్ట్ ఎమోషన్స్.. వెస్ట్రన్ ప్రజెంటేషన్’’ అంటూ సినిమా స్థాయిని వివరించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది.

సమురాయ్ అవతారంలో పవన్

వీడియోలో కనిపించిన సమురాయ్ కత్తులు, సంప్రదాయ ఆయుధాలు, పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. ‘ఓజీ’ తదుపరి భాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేలా తీర్చిదిద్దుతున్నట్లు అర్థమవుతోంది. సుజీత్ విజన్, భారీ ప్రణాళికలు చూసిన అభిమానులు సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags: