Ustaad Treat on Ugadi: పవన్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ఉగాదికి ఉస్తాద్!
ఉగాదికి ఉస్తాద్!
Ustaad Treat on Ugadi: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19 కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. యశ్ టాక్సిక్ వాయిదా పడటంతో ఆ లోటు భర్తీ చేసేందుకు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని చూస్తున్నారు.ఇదే నిజ ఐతే పవన్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.
గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి ఆయన పాత్ర మరింత మాస్ గా, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే హింట్ ఇచ్చారు.
హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలైనట్టే. వీరిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి.
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ (DSP) పాటలు అందిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఎస్.ఎస్. థమన్‌ను రంగంలోకి దించడం విశేషం. వీరిద్దరి కాంబోలో మ్యూజిక్ పీక్స్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల. రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నార్త్ ఇండియా నటుడు పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.