Pawan Kalyan’s ‘Aara of Ustaad’ Song: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌సింగ్‌‌‌‌’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘దేఖ్‌‌‌‌లేంగే సాలా’ అంటూ విడుదలైన పాట అభిమానులను అలరించింది. ఆదివారం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో సెకండ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌‌‌‌కు చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ రాశారు. ‘నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. జుట్టు ఎగురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే..’ అని సాగిన పాట ఫ్యాన్స్‌‌‌‌లో జోష్‌‌‌‌ని నింపేలా ఉంది. ఇప్పటికే పలు చిత్రాల్లో మెడపై చేయివేసే మేనరిజంతో అలరించిన పవన్ కళ్యాణ్​ ఇందులో మరోసారి అలాంటి గెటప్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పార్తిబన్, కె యస్ రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కె జి ఎఫ్ అవినాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్చి 26న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.

Tags: