Pawan Kalyan’s Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ బ్లాస్ట్.. ముహూర్తం ఖరారు
ముహూర్తం ఖరారు
Pawan Kalyan’s Ustaad Bhagat Singh: మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
గత రికార్డుల రిపీట్ లక్ష్యంగా..
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు హరీశ్ శంకర్ సిద్ధమయ్యారు. గత్తర లేపేద్దాం అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్రంలో పవన్ సరసన టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందిస్తుండగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.
ఉగాది కానుకగా విడుదల:
ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ అయింది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందడి:
మార్చి 15న హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ హాజరుకానుండటంతో అభిమానుల సందడి మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.