Pawan Kalyan’s Ustaad Bhagat Singh Update: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్‌డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టిన రాశీ ఖన్నా..

డబ్బింగ్ మొదలుపెట్టిన రాశీ ఖన్నా..

Update: 2026-02-09 07:15 GMT

Pawan Kalyan’s Ustaad Bhagat Singh Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ శరవేగంగా ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ రాశీ ఖన్నా ఒక క్రేజీ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

డబ్బింగ్ ప్రారంభం:

తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను రాశీ ఖన్నా మొదలుపెట్టారు. "డబ్బింగ్ మొదలైందంటే సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్టే" అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో రాశీ శ్లోక అనే కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. పవన్ కల్యాణ్‌తో రాశీ ఖన్నా స్క్రీన్ పంచుకోవడం ఇదే మొదటిసారి. ఆయనతో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీలీల మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. డబ్బింగ్ పనులు కూడా మొదలవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News