Telugu Cinema:పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ బ్రేకులు పడినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 12న రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించిన రిలీజ్ వాయిదా పడిందనే ప్రచారం జోరందుకుంది. దానికి కారణం ఆర్థిక సమస్యలని సమాచారం. నిర్మాత ఏఎం రత్నం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ ముందుకొచ్చి నిర్మాతకు అండగా నిలబెట్టారు.

అవును..పవన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మా నిర్మాత ఏ.ఎం రత్నం ఆర్ధిక ఇబ్బందులు పడుతుండగా.. ఆయ‌న వ‌ద్ద నుంచి తీసుకున్న రూ. 11 కోట్ల అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలని ప‌వ‌న్ నిర్ణయించుకున్నట్లు టాక్ న‌డుస్తుంది. సినిమా విడుదలపై సాఫీగా విడుదలవ్వాలనే ఉద్ధేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రోవైపు హరి హర వీర మల్లు మూవీ విడుదల తేదీపై గందరగోళం కొన‌సాగుతునే ఉంది. వాస్తవానికి ఈ చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండ‌గా.. ప్రస్తుతం జూలై 4న విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే కొత్త పోస్టర్ తో రిలీజ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

Tags: