'Peddhi' movie: 'రై రై రా రా': రామ్ చరణ్ మాస్ స్వాగ్.. రెహమాన్ అదిరిపోయే బీట్స్!

రెహమాన్ అదిరిపోయే బీట్స్!

Update: 2026-03-03 06:19 GMT

'Peddhi' movie: రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా అప్‌డేట్స్ ఊపు అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట "రై రై రా రా" విడుదలైంది. హీరో ఎలివేషన్ సాంగ్‌గా వచ్చిన ఈ పాట, రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. షుగర్ ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఈ పాటలో, చరణ్ అక్కడి కార్మికులు మరియు పల్లెటూరి పిల్లలతో కలిసి చిందులేస్తూ పూర్తి మాస్ లుక్‌లో కనిపించారు.

ఈ పాటకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అటు సంగీతం అందించడమే కాకుండా స్వయంగా పాడటం విశేషం. రెహమాన్ మార్క్ వింటేజ్ టచ్‌తో కూడిన సాలిడ్ బీట్స్, ఆధునిక ఇన్‌స్ట్రుమెంటేషన్ ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచాయి. రెహమాన్ పాడే ప్రత్యేకమైన శైలి పాటకి ఒక కొత్త ఫీల్‌ని ఇచ్చింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ తనదైన శైలిలో గ్రేస్‌తో కూడిన మాస్ స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు.

లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం హీరో పాత్రలోని ధైర్యాన్ని, తెగింపును ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా పాట అంతటా "రా" అనే అక్షరంతో వచ్చే ప్రాస (Rhyming) వినడానికి చాలా క్యాచీగా ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓవరాల్‌గా "రై రై రా రా" సాంగ్ మాస్ విజువల్స్ మరియు రెహమాన్ మ్యూజిక్ పంచ్‌తో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Tags:    

Similar News