“Peddi” Editing Completed: పెద్ది ఎడిటింగ్ పూర్తి.. జూన్ 3న ప్రీమియర్లు, 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

జూన్ 3న ప్రీమియర్లు, 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

Update: 2026-05-07 13:15 GMT

“Peddi” Editing Completed: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రం షూటింగ్, ఎడిటింగ్ పనులను పూర్తి చేసుకుని, ఫైనల్ కట్ లాక్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

విడుదల తేదీ అప్‌డేట్:

చిత్ర యూనిట్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులకు తీపి కబురు అందించింది. జూన్ 3, 2026 నుండి భారీ ఎత్తున ప్రీమియర్ షోలు పడనున్నాయి. జూన్ 4న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

షూటింగ్ ముగిసింది.. చరణ్ పై రత్నవేలు ప్రశంసలు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ నెల 1న షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించారు. రామ్ చరణ్‌తో పని చేయడంపై ఆయన ఎమోషనల్ అవుతూ.. "చరణ్ ఒక పవర్‌హౌస్ పెర్ఫార్మర్. ఆయన కేవలం అద్భుతమైన నటుడే కాదు, నిజజీవితంలో ఎంతో ఆత్మీయత కలిగిన నమ్మదగ్గ స్నేహితుడు" అని కొనియాడారు.

సర్‌ప్రైజ్ సాంగ్ - రెహమాన్ మ్యాజిక్:

ఏప్రిల్ 29న హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో ఈ సినిమాలోని చివరి పాట చిత్రీకరణ పూర్తయింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో చరణ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, ఇది ఖచ్చితంగా ఒక చార్ట్‌బస్టర్ సాంగ్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, రామ్ చరణ్ కెరీర్‌లోనే మరో భారీ మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మెగా అభిమానులు పెద్ది జాతర కోసం జూన్ 4 వరకు కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు..

Tags:    

Similar News