‘Peddi’ Glimpse: ఆటే నా పొగరు..అదిరపోయిన పెద్ది గ్లింప్స్

అదిరపోయిన పెద్ది గ్లింప్స్

Update: 2026-03-28 07:20 GMT

‘Peddi’ Glimpse: ‘రై రై రా రా...’ అంటూ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌ పట్టుకుని సిక్సులు కొట్టిన ‘పెద్ది’ రూటు మార్చాడు. గద పట్టుకుని పహిల్వాన్‌‌‌‌‌‌‌‌లా కుస్తీ రింగులోకి దిగాడు. ‘ఆటే నా పొగరు’ అంటూ కండలు తిరిగిన దేహంతో దుమ్ము దులుపుతున్నాడు. ‘పెద్ది’ మూవీ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌లో హైలైట్‌‌‌‌‌‌‌‌ ఇదే. శుక్రవారం రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ పుట్టినరోజు. అలాగే శ్రీరామ నవమి కూడా కావడంతో అభిమానులకు గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ రూపంలో అద్భుతమైన గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చారు మేకర్స్‌‌‌‌‌‌‌‌. ‘‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట” అంటూ ఓ గంభీరమైన గొంతు హెచ్చరించింది. అయితే దాన్నొక ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్న పెద్ది... అప్పటివరకు బ్యాట్‌‌‌‌‌‌‌‌ పట్టిన చేతితో గద పట్టాడు. కఠోరమైన శిక్షణ, కఠినమైన వ్యాయామాలు తట్టుకుంటూ, ఇసుక సంచులు ఎత్తుతూ, ఇటుక గోడలు ఎక్కుతూ సంకల్ప బలంతో ముందుకు కదిలాడు.

హనుమంతుడిలా గద తిప్పుతూ ‘పెద్ది’ ఓ పహిల్వాన్‌‌‌‌‌‌‌‌లా ఎదిగాడు. ఆ పాత్ర కోసం రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ పడ్డ కష్టం, తనను ఓ మల్లయోధుడిలా బుచ్చి బాబు సానా ప్రెజెంట్‌‌‌‌‌‌‌‌ చేసిన తీరు ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. రత్నవేలు కెమెరా వర్క్, రెహమాన్‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 30న విడుదల కానుంది.

Tags:    

Similar News