Ram Charan: నా కెరీర్‌లోనే టాప్ సినిమా పెద్ది: రామ్ చరణ్

రామ్ చరణ్

Update: 2026-06-02 05:19 GMT

Ram Charan: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపేందుకు రెడీ అయిపోయింది. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్‌తో వస్తున్న ఈ చిత్రం.. ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

ఈ సందర్భంగా సోమవారం రాత్రి విజయవాడలో జరిగిన ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ వేడుక నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ ఈవెంట్‌లో.. లెజెండరీ కంపోజర్ ఎ.ఆర్.రెహమాన్ తన బృందంతో కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.

రామ్‌చరణ్ మాటల్లోనే: "నా జీవితంలో టాప్ సినిమాగా నిలిచే చిత్రం ‘పెద్ది’. నటుడిగా నాకు ఎంత తృప్తినిచ్చిందో, వ్యక్తిగతంగా కూడా నన్ను ఒక మంచి దారిలో నిలిపింది. మాకు ఎంతో కలిసొచ్చిన విజయవాడ నగరం నుంచి అదృష్టాన్ని ఇంటికి తీసుకెళదామనే ఈ వేడుక ఇక్కడ చేశాం.కథ గురించి చెబుతూ.. "మా నాన్న (చిరంజీవి) అన్నట్టుగా పదేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన కథ వస్తుంది. బుచ్చిబాబు ఈ కథను సినిమాగా చెప్పలేదు, ఒక వ్యక్తి ప్రయాణంలా వివరించారు. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల తర్వాత అంతటి ఇష్టంతో, కష్టపడి చేసిన సినిమా ఇదే!" అంటూ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

తన మెగా లెగసీ గురించి ప్రస్తావిస్తూ.. "చిరంజీవి గారి అబ్బాయిగా పుట్టినందుకు, కల్యాణ్ బాబాయ్‌ని చూస్తూ పెరిగినందుకు నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను వినోదపరుస్తూనే ఉంటా" అని చరణ్ అనడంతో స్టేడియం మొత్తం మెగా నినాదాలతో హోరెత్తిపోయింది.

Tags:    

Similar News