Peddi: పెద్ది ఏప్రిల్ కు వాయిదా

ఏప్రిల్ కు వాయిదా

Update: 2026-02-05 04:56 GMT

Peddi: యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయ నున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ను మార్చారు. ఏప్రిల్ 30న సినిమాను ప్రేక్ష కుల ముందుకు తీసుకొస్తున్నట్టు బుధవారం కొత్త విడుదల తేదీని ప్రకటిం చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రి లీజ్ డేట్ పోస్టర్ లో రామ్ చరణ్ మాస్ లుక్తో ఇంప్రెస్ చేశారు. స్పోర్ట్స్ బ్యా ప్లోలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన పాత్రలోకనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Tags:    

Similar News