‘చికిరి చికిరి’ తర్వాత ‘పెద్ది’ నుంచి రెండో సింగిల్ ‘రై రై రా రా’ విడుదల
ఏ.ఆర్. రెహమాన్ సంగీతానికి రామ్ చరణ్ ఎనర్జీ మేళవింపు – మాస్ బీట్‌తో మళ్లీ హీట్ పెంచిన గ్లోబల్ స్టార్
2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన Peddi నుంచి మరో హై-ఎనర్జీ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లోబల్ స్టార్ Ram Charan ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ Buchi Babu Sana దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాను షేక్ చేస్తూ 200 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి ఈ ఏడాది అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో వచ్చిన ఆ పాటకు విశేష స్పందన లభించింది.
తాజాగా చిత్ర బృందం రెండో సింగిల్ ‘రై రై రా రా’ను విడుదల చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ తన స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో మరోసారి అభిమానులను అలరించారు. ఎనర్జీ, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ All in One గా కనిపిస్తూ భారతీయ సినీ పరిశ్రమలో తాను ఎందుకు అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరో మరోసారి నిరూపించారు.
ఈ పాటకు సంగీతం అందించిన మ్యూజిక్ మాస్ట్రో A. R. Rahman ప్రత్యేకమైన బీట్‌లు, పుల్సేటింగ్ ట్యూన్‌తో ట్రాక్‌ను మాస్ యాంథమ్‌గా మార్చేశారు. తొలి సింగిల్‌లో కనిపించిన రెహమాన్ సిగ్నేచర్ టచ్ మళ్లీ ఈ పాటలో కూడా స్పష్టంగా వినిపిస్తోంది.
‘పెద్ది’ సినిమాలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ Mythri Movie Makers తో కలిసి ఈ చిత్రం తెరకెక్కుతోంది.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు పాటలతోనే సంగీత పరంగా సంచలనం సృష్టించిన ‘పెద్ది’ విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.