Actress Priyanka Chopra: హైదరాబాద్ షూటింగ్‌లో ప్రియాంక చోప్రా సందడి.. స్విమ్మింగ్ పూల్ ఫోటోలు వైరల్!
స్విమ్మింగ్ పూల్ ఫోటోలు వైరల్!
Actress Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం నవాబుల నగరం హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. తన కొత్త సినిమా "వారణాసి" షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చిన ఆమె, అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టారు. వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక, తాజాగా దొరికిన ఆదివారం సెలవును తనదైన శైలిలో ఎంజాయ్ చేశారు. సాధారణంగా షూటింగ్స్ వల్ల ఆదివారాలు కూడా పనిలోనే గడిచిపోతుంటాయని, కానీ చాలా కాలం తర్వాత ఈ సండే మాత్రం నిజమైన సెలవు దినంలా అనిపించిందని ఆమె సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ విరామ సమయంలో ప్రియాంక తన హైదరాబాద్ నివాసంలోని స్విమ్మింగ్ పూల్‌లో స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు. నీళ్లలో సేదతీరుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకోగా, ముఖ్యంగా బికినీలో ఉన్న ఆమె స్టైలిష్ లుక్స్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కేవలం ఎంజాయ్‌మెంట్ మాత్రమే కాకుండా, తన తల్లి మరియు గారాల పట్టి మాల్తీ మేరీతో కలిసి గడిపిన హృదయపూర్వక దృశ్యాలను కూడా ఆమె పోస్ట్ చేశారు. వీటికి తోడు హైదరాబాద్ ఎండలకు తోడుగా ఇక్కడి లోకల్ టచ్ ఇస్తూ.. ఉప్పు, కారం చల్లిన పచ్చి మామిడి ముక్కలను తింటున్న ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీగా తెరకెక్కుతున్న "వారణాసి" చిత్రంలో ప్రియాంక నటిస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ఆయన రుద్ర మరియు శ్రీరాముడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రియాంక 'మందాకిని' అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.