Pooja Hegde: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?

వరుడు ఎవరంటే?

Update: 2026-05-01 06:44 GMT

Pooja Hegde: పూజా హెగ్డే పెళ్లి వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఆమె తన కొత్త హిందీ సినిమా “హై జవానీ హై తో ఇష్క్ హోనా హై” ప్రమోషన్లలో బిజీగా ఉండగా, అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా పూజా హెగ్డే, రోహన్ మెహ్రా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. గతేడాది కాలంగా వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో జంటగా కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరి బంధం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని, త్వరలోనే వీరు వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పూజా వయస్సు 35 ఏళ్లు దాటడంతో, త్వరగా సెటిల్ అవ్వాలని కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఆమె పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ ఏడాది చివర్లో పూజా తన పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా బుట్టబొమ్మ పెళ్లి వార్త ఇప్పుడు ఆమె అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

Tags:    

Similar News