Nani’s Paradise: నాని ప్యారడైజ్‌ లో పవర్ ఫుట్‌‌‌‌‌‌‌ ఇంట్రో సాంగ్ రెడీ

పవర్ ఫుట్‌‌‌‌‌‌‌ ఇంట్రో సాంగ్ రెడీ

Update: 2026-02-10 04:29 GMT

Nani’s Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. పీరియాడిక్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా నాని ఇంట్రోకు సంబంధించిన సాంగ్‌‌‌‌‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. ‘ఆయా షేర్’ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌‌‌‌‌‌‌‌ కోసం అనిరుధ్ ఎనర్జిటిక్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ను కంపోజ్ చేశాడు. దీనికోసం వేసిన భారీ సెట్‌‌‌‌‌‌‌‌లో వందలాది మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ విజయ్ ‘జన నాయగన్’కు పనిచేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్, షార్ప్ మూవ్స్, పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌తో గూస్ బంప్స్ కలిగించే విజువల్స్‌‌‌‌‌‌‌‌తో ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌ ఉండనుందని మేకర్స్ చెప్పారు. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ గెటప్‌‌‌‌‌‌‌‌లో నాని ఈ చిత్రంలో కనిపించనున్నాడు. మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఎనిమిది భాషలలో పాన్-వరల్డ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌తోపాటు ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.

Tags:    

Similar News