Ustad Bhagat Singh Releasing: బాక్సాఫీస్ వద్ద పవర్ తుపాన్.. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఏ రోజంటే..?
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఏ రోజంటే..?
Ustad Bhagat Singh Releasing: మెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ఖరారైంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
టాలీవుడ్ చరిత్రలో గబ్బర్ సింగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సరిగ్గా అదే కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. "ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ రికార్డుల వేట కూడా ఉంటుంది" అని మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సంకేతాలు ఇస్తోంది. విడుదల తేదీ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే నెట్టింట పవర్ స్టార్ నామస్మరణ మారుమోగిపోతోంది. #UBSOnMarch26th అనే హ్యాష్‌ట్యాగ్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్‌తో వస్తున్న ఈ సినిమా, పవన్ కల్యాణ్‌కు మరో భారీ హిట్‌ను అందిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.