Powerful ‘Mark’ Trailer Released: సుదీప్ పవర్‌ఫుల్ మార్క్ ట్రైలర్
పవర్‌ఫుల్ మార్క్ ట్రైలర్
Powerful ‘Mark’ Trailer Released: కన్నడ స్టార్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ చిత్రం ‘మార్క్’. సుదీప్ కెరీర్‌లో ఇది 47వ చిత్రంగా రూపొందుతోంది. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. అజయ్ మార్కండేయగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుదీప్ పాత్రను పరిచయం చేశారు. పిల్లల కిడ్నాప్ కేసుల చుట్టూ తిరిగే మిస్టరీ డ్రామాగా ఈ కథను రివీల్ చేశారు. ఇందులో సుదీప్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు. యాక్షన్‌తో నిండిన సుదీప్ స్టైలిష్ ప్రెజెన్స్ ట్రైలర్‌ను మరింత హైలైట్ చేసింది. నవీన్ చంద్ర, గురు సోమసుందరం, యోగిబాబు, విక్రాంత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోకనాథ్ అందించిన బీజీఎం ఆకట్టుకుంది. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.