Prabhas Praises: సంతోష్ శోభన్ మూవీపై ప్రభాస్ ప్రశంసలు
ప్రభాస్ ప్రశంసలు
Prabhas Praises: యంగ్ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రివ్యూ ఇచ్చారు.ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే సందర్భంగా) విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రభాస్, మూవీ టీమ్‌ని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"నాకు 'వర్షం' సినిమా ఎంత ప్రత్యేకమో, నా డియర్ సంతోష్ శోభన్ కెరీర్‌లో 'కపుల్ ఫ్రెండ్లీ' అంత ప్రత్యేకంగా నిలుస్తుంది" అని ప్రభాస్ పేర్కొనడం విశేషం. సంతోష్ శోభన్, మానస వారణాసిల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుందని, ఇద్దరూ అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. ఇదొక "లవ్లీ అండ్ బ్యూటిఫుల్ ఫిలిం" అని, సినిమా చూస్తున్నంత సేపు తాను చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ప్రతిభను, అలాగే ఇలాంటి మంచి కథలను ప్రోత్సహిస్తున్న యూవీ క్రియేషన్స్ (అజయ్) బృందాన్ని అభినందించారు.
ప్రభాస్ రివ్యూపై హీరో సంతోష్ శోభన్ కూడా చాలా ఎమోషనల్ గా స్పందించారు. "ప్రభాస్ అన్న సినిమా చూసి మెచ్చుకోవడంతోనే నేను గెలిచాను అనే ఫీలింగ్ కలిగింది" అని సంతోష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
లివింగ్ రిలేషన్ షిప్, యూత్ ఫుల్ అంశాల నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ మూవీ రూపొందించారు . సహజమైన సన్నివేశాలు, మెచ్యూర్డ్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.