Prabhas’ ‘Spirit’: ప్రభాస్ స్పిరిట్ వాయిదా..? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగా టీమ్..
సందీప్ వంగా టీమ్..
Prabhas’ ‘Spirit’: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ . ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ విడుదల వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లకు చిత్ర యూనిట్ ఎట్టకేలకు తెరదించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మార్చి 5న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు నిర్మాణ బృందం అధికారికంగా స్పష్టం చేసింది.
గత కొద్ది రోజులుగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరుగుతోందని, అదే సమయంలో సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి కాంబో సినిమా బరిలో ఉండటంతో ‘స్పిరిట్’ వాయిదా పడనుందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని మేకర్స్ తేల్చిచెప్పారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఉన్న గందరగోళం పూర్తిగా తొలగిపోయింది.
ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. మాఫియా, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సందీప్ రెడ్డి వంగా సరికొత్త పంథాలో కథను నడిపించనున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొమ్మిది భాషల్లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్నారు.