Prabhas’s “Spirit”: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డేట్ ఫిక్స్

'స్పిరిట్' రిలీజ్ డేట్ ఫిక్స్

Update: 2026-05-07 07:39 GMT

Prabhas’s “Spirit”: ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "స్పిరిట్". గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగింది. ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2', 'ఫౌజీ' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే దీనికి కారణమని వార్తలు వచ్చాయి. అయితే, ఈ రూమర్లకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"స్పిరిట్" సినిమా విడుదల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ చిత్రం 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ, షూటింగ్ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని భరోసా ఇచ్చింది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్స్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తీస్తున్న సినిమా కావడం, ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాయిదా వార్తలను ఖండించడంతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tags:    

Similar News