‘Idupu Kayitham’: టాలెంటెడ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) నటిస్తున్న లేటెస్ట్ కుటుంబ కథా చిత్రం 'ఇడుపుకాయితం'. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'ఓ శ్రీలత' ప్రోమోను విడుదల చేశారు.

ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత... శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత” అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్‌కు సురేష్ బొబ్బిలి అద్భుతమైన బాణీలు అందించారు. అల రాజు ఈ పాటకి ఆకట్టుకునే సాహిత్యం (Lyrics) అందించారు.

ఈ చిత్రంలో శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ పూర్తి స్థాయి ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Tags: