Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నయా స్పై అవతార్

నయా స్పై అవతార్

Update: 2026-04-23 03:38 GMT

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ ఇప్పుడు సెకండ్ సీజన్‌తో మన ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా విడుదలైన ఈ సీజన్ 2 ట్రైలర్ చూస్తుంటే, మొదటి సీజన్ కన్నా యాక్షన్, డ్రామా డబుల్ డోస్‌లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.

మొదటి సీజన్ ముగింపులో ‘మ్యాంటికోర్’ అనే నేరపూరిత నెట్‌వర్క్ ధాటికి స్పై ఏజెన్సీ ‘సిటాడెల్’ కుప్పకూలిన సంగతి మనకు తెలిసిందే. సరిగ్గా అక్కడి నుంచే ఈ రెండో సీజన్ కథ ప్రారంభం కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి పెను ముప్పుగా మారే ఒక భారీ కుట్రను మ్యాంటికోర్ నెట్‌వర్క్ ప్లాన్ చేస్తుంది. ఈ వినాశనాన్ని ఆపగలిగే శక్తి కేవలం మాజీ ఏజెంట్లకు మాత్రమే ఉంది.ఈ ముప్పును ఎదుర్కొనేందుకు మాజీ ఏజెంట్లయిన నదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా), మేసన్ కేన్ (రిచర్డ్ మ్యాడెన్), బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుస్సి) మళ్ళీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతారు. ఈ పాత శత్రువులను ఢీకొట్టడానికి వీరు ఒక కొత్త టీమ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇందులో మెర్లే డాండ్రిడ్జ్, గాబ్రియేల్ లియోన్ వంటి కొత్త నటీనటులు చేరడం కథకు మరింత బలాన్ని ఇస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈసారి నదియా, మేసన్ మధ్య ఉండే ఎమోషన్స్‌ను కూడా దర్శకుడు బలంగా చూపించబోతున్నారు.

ప్రసిద్ధ రూసో బ్రదర్స్‌కు చెందిన ఏజీబీవో, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ సిరీస్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. మే 6, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం వంటి భారతీయ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

Tags:    

Similar News