Producer Allu Aravind: ఆ సంతోషం నాకు బాగా తెలుసు
నాకు బాగా తెలుసు
Producer Allu Aravind: ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శంబాల' (Shambhala) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన నేపథ్యంలోడివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు."సాయికుమార్ కుటుంబంతో మాకు మూడు తరాల అనుబంధం ఉంది. ఒక కొడుకు విజయం సాధిస్తే తండ్రి పడే ఆరాటం, పొందే సంతోషం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆదికి ఇంత మంచి హిట్ రావడం చూసి, సాయికుమార్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నాను. ఆ సంతోషంలో పాలుపంచుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను."
"నేను 'శంబాల' సినిమా చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ యుగంధర్ ముని సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంటెంట్ చాలా బాగుంది."ఈ ఈవెంట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం చూసి అల్లు అరవింద్ ఆశ్చర్యపోయారు. ఆమె మాటలకు ఫిదా అయిన ఆయన, "ఇంత చిన్న వయసులో ఇంత స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడటం గొప్ప విషయం" అని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సోషల్ మీడియా వేదికగా టీమ్‌కు అభినందనలు తెలపడం విశేషం.చాలా కాలం తర్వాత ఆది సాయికుమార్‌కు ఒక సోలిడ్ హిట్ లభించడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.