'Vishnu Vinyasam' Movie: శ్రీవిష్ణు..విష్ణు విన్యాసం పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Update: 2026-02-27 07:38 GMT

'Vishnu Vinyasam' Movie: శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన 'విష్ణు విన్యాసం' సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. తొలి షోల నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ , మార్నింగ్ షోల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పటిలాగే శ్రీవిష్ణు తనదైన శైలిలో కామెడీతో ఆకట్టుకున్నారు. ఆయన మార్కు వన్-లైనర్స్ , బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.

సినిమా ఫస్టాఫ్ చాలా వేగంగా, హిలేరియస్ కామెడీతో సాగిపోతుందని ప్రేక్షకులు చెబుతున్నారు. కాలేజీ లెక్చరర్‌గా శ్రీవిష్ణు, ఆయన స్నేహితుడిగా సత్య మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. జాతకాలు, గ్రహగతులను అతిగా నమ్మే యువకుడి చుట్టూ తిరిగే కథ కావడం వల్ల అది యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. హీరోయిన్ నయన్ సారిక తన నటనతో, లుక్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది.

ప్లస్ పాయింట్లు:

శ్రీవిష్ణు, సత్యల కామెడీ కెమిస్ట్రీ.

సినిమా నిడివి (దాదాపు 2 గంటలు) తక్కువగా ఉండటం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు.

నేటి ట్రెండింగ్ 'మీమ్' రిఫరెన్స్‌లను వాడుకోవడం యూత్‌కు బాగా నచ్చుతోంది.

మైనస్ పాయింట్లు:

సెకండాఫ్: రెండో భాగంలో కథ కొంచెం స్లో అయినట్లు, ఎమోషనల్ సీన్లు ఆశించిన స్థాయిలో పండలేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంగీతం: రథన్ అందించిన సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదని టాక్.

బాటమ్ లైన్: వీకెండ్‌లో హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి 'విష్ణు విన్యాసం' ఒక మంచి ఆప్షన్. ఒక "స్ట్రెస్ ఫ్రీ" కామెడీ ఎంటర్టైనర్‌గా దీనిని చూడవచ్చు.

Tags:    

Similar News