‘Pushpa 2’ Mania: ఫిల్మ్‌‌‌‌ఫేర్‌‌‌‌‌‌‌‌లో పుష్ప 2 మేనియా

పుష్ప 2 మేనియా

Update: 2026-02-23 04:14 GMT

‘Pushpa 2’ Mania: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెస్టేజీయస్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌గా భావించే ‘ఫిల్మ్‌‌‌‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026’ వేడుక శనివారం కేరళలో అంగరంగ వైభవంగా జరిగింది. 2024-–25 సంవత్సరానికి గాను 70వ ఎడిషన్‌‌‌‌కు సంబంధించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు కొచ్చిలో అవార్డులను అందజేశారు. తెలుగు సినిమా విభాగంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ఐదు అవార్డులను గెల్చుకుని సౌత్‌‌‌‌లో తన సత్తాను చాటింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌‌‌‌‌‌‌‌ అవార్డులను అందుకున్నారు. మరోవైపు ‘35 చిన్న కథ కాదు’ చిత్రంలో మిడిల్‌‌‌‌క్లాస్ హౌస్‌‌‌‌ వైఫ్‌‌‌‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న నివేదా థామస్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

అలాగే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడిగా అమితాబ్ బచ్చన్ అవార్డును గెలుచుకున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో కీలక పాత్ర పోషించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా అవార్డు కైవసం చేసుకుంది. ఇక బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ కేటగిరీలో తేజ సజ్జా, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ కేటగిరీలో లక్కీ భాస్కర్, ‘గుంటూరు కారం’లోని కుర్చీ మడతపెట్టి పాటకుగాను గాయకుడు కేటగిరీలో శ్రీకృష్ణ, బెస్ట్ కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా శేఖర్ మాస్టర్, ఉత్తమ సాహిత్యం కేటగిరీలో ‘దేవర’ చిత్రంలోని చుట్టమల్లే పాటకు రామజోగయ్య శాస్త్రి, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా యదు వంశీ (కమిటీ కుర్రాళ్లు), ఉత్తమ డెబ్యూ యాక్టర్‌‌‌‌‌‌‌‌గా సందీప్ సరోజ్ (కమిటీ కుర్రాళ్లు), ఉత్తమ డెబ్యూ హీరోయిన్‌‌‌‌గా నయన్ సారిక (గం గం గణేశా) అవార్డులను అందుకున్నారు.

Tags:    

Similar News