R. Narayana Murthy: ఆర్. నారాయణమూర్తి ఎవ్వరికీ తలొంచని వ్యక్తి: బ్రహ్మానందం
ఎవ్వరికీ తలొంచని వ్యక్తి: బ్రహ్మానందం;
R. Narayana Murthy: ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రెస్ మీట్‌లో బ్రహ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఆ సినిమా, దాని దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి గురించి బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్యావ్యవస్థ, విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు ఎలా ఉండేవి, అవి ఇప్పుడు ఎలా మారాయి? అనే అంశంపై ఆర్. నారాయణ మూర్తి ఎంతో పరిశోధన చేసి, ఈ 'యూనివర్సిటీ పేపర్ లీక్' సినిమా తీశారని బ్రహ్మానందం ప్రశంసించారు. ఆయన సినిమాలు డబ్బు కోసం కాకుండా సమాజానికి ఒక సందేశం ఇవ్వడం కోసమే తీస్తారని చెప్పారు.
గత 40 ఏళ్లుగా తనకు తెలిసిన నారాయణ మూర్తి నిరంతరం ప్రజల కోసం, ముఖ్యంగా పేదల కోసం పనిచేస్తూనే ఉన్నారని బ్రహ్మానందం చెప్పారు. డబ్బుకు, ప్రలోభాలకు లొంగని నిజాయితీ గల వ్యక్తి అని కొనియాడారు. "నారాయణ మూర్తి ఎవరికీ తలవంచడు, తన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు" అని బ్రహ్మానందం అన్నారు.విద్యావ్యవస్థలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను ఈ సినిమా ద్వారా చూపించడం గొప్ప విషయమని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం "మీ దృష్టిలో అత్యంత అందమైన హీరో ఎవరు?" అని ఒక ప్రశ్న వేసి, దానికి తానే సమాధానం చెప్పారు. "నా దృష్టిలో అత్యంత అందమైన హీరో ఆర్. నారాయణ మూర్తి" అని ఆయన ప్రకటించారు. కేవలం ముఖ కవళికలతో కాకుండా, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, నిస్వార్థమైన జీవితం కారణంగానే నారాయణ మూర్తి నిజమైన అందమైన హీరో అని వివరించారు.