‘Raaka’ Global Music: రాకా గ్లోబల్ మ్యూజిక్.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో బన్నీ-అట్లీ మూవీ సాంగ్స్

ఇంటర్నేషనల్ రేంజ్‌లో బన్నీ-అట్లీ మూవీ సాంగ్స్

Update: 2026-04-21 07:26 GMT

‘Raaka’ Global Music: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ సినిమా మ్యూజిక్ గురించి చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి.

ప్రపంచ స్థాయి సౌండ్‌తో..

సాయి అభ్యంకార్ మాట్లాడుతూ.. రాకా సంగీతాన్ని కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ సినిమా ఆల్బమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అట్లీ విజన్.. బన్నీకి నచ్చిన థీమ్ ట్రాక్

దర్శకుడు అట్లీకి సంగీతంపై ఉన్న పట్టు, స్పష్టత గురించి సాయి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "సినిమాకు ఎలాంటి సౌండ్ కావాలి, ఏ సందర్భంలో ఎలాంటి ట్రాక్ ఉండాలి అనే విషయంలో అట్లీకి పూర్తి అవగాహన ఉంది. ఆయన విజన్‌కు తగ్గట్టుగా నేను కంపోజ్ చేసిన థీమ్ ట్రాక్ అల్లు అర్జున్‌కి, అట్లీకి ఎంతో నచ్చింది" అని సాయి అభ్యంకార్ తెలిపారు.

ప్రతి పాటలోనూ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచేలా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు మ్యూజిక్ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. కేవలం మాస్ మసాలా చిత్రంగానే కాకుండా సాంకేతికంగా ‘రాకా’ ఒక ఉన్నత ప్రమాణాలతో కూడిన సినిమాగా ఉండబోతోంది. అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్‌కు, అట్లీ పవర్‌ఫుల్ మాస్ టేకింగ్‌కు సాయి అభ్యంకార్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ తోడవ్వడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌ కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ భారీ ప్రాజెక్ట్ నుండి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News