Raashi Clarifies: ప్రభాస్‌కు తల్లిగా నటించను.. కానీ: నెట్టింట వైరల్ అవుతున్న విమర్శలపై నటి రాశి క్లారిటీ..

కానీ: నెట్టింట వైరల్ అవుతున్న విమర్శలపై నటి రాశి క్లారిటీ..

Update: 2026-03-28 07:45 GMT

Raashi Clarifies: టాలీవుడ్ సీనియర్ నటి రాశి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ప్రభాస్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి వస్తున్న విమర్శలపై ఆమె తాజాగా స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన అనుమాన పక్షి సినిమా వేడుకలో రాశి ఈ వివాదానికి ముగింపు పలుకుతూ తన వెర్షన్‌ను స్పష్టంగా వివరించారు.

అసలేం జరిగింది?

గతంలో ఒక ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, అయితే ఆయనకు తల్లి పాత్రలో నటించడం మాత్రం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని, ఆమె ప్రభాస్‌తో నటించడానికి నిరాకరిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు.

రాశి ఇచ్చిన వివరణ:

ఈ విమర్శలపై రాశి స్పందిస్తూ.. "నేను ప్రభాస్ సినిమాలో సోదరి పాత్ర చేయనని ఎక్కడా చెప్పలేదు. కేవలం తల్లి పాత్రకు మాత్రమే సిద్ధంగా లేనని అన్నాను. ఇతర ఏ పాత్రలోనైనా ఆయనతో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రభాస్ సినిమాలకు డబ్బింగ్ చెప్పినా, ఆయన్ను ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలవలేకపోయానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అనుమాన పక్షిపై ధీమా:

డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కిన అనుమాన పక్షి చిత్రంలో రాశి ఒక కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 148 సినిమాల్లో హీరోయిన్‌గా నటించానని, ఆ అనుభవంతో చెబుతున్నాను.. ఈ సినిమా కథ వినగానే తనకు చాలా నచ్చిందని ఆమె తెలిపారు. ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News