Raasi: 21 ఏళ్ల మ్యారేజ్ సీక్రెట్ బయటపెట్టిన నటి రాశి
సీక్రెట్ బయటపెట్టిన నటి రాశి
Raasi: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్ వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది నటి రాశి. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి.. దాదాపు 300 పైగా సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో 'జానకి కలగనలేదు' వంటి సీరియల్స్‌తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు.అయితే సినిమా రంగంలో ఎంతోమంది జంటలు విడిపోతున్నా.. అసోసియేట్ డైరెక్టర్ నివాస్ అలియాస్ శ్రీనివాసుతో తన 21 ఏళ్ల వివాహ బంధం ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి గల సీక్రెట్స్‌ను ఆమె తాజాగా పంచుకున్నారు.
రాశి మాటల్లో చెప్పాలంటే.. వారిద్దరూ ఇంట్లో ప్రొఫెషన్ గురించి అస్సలు మాట్లాడుకోరట. ఎవరి పని వారిదే. షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తే తను కేవలం భార్యగా.. ఆయన కేవలం భర్తగా మాత్రమే ఉంటామని స్పష్టం చేశారు. ఆయనను ముద్దుగా శ్రీను అని, సరదాగా 'ఒరేయ్' అని పిలుచుకుంటారట. నాకు బయట ఎవండీ.. శ్రీనివాస్ గారూ.. డైరెక్టర్ గారూ.. అంటూ నటించడం రాదు. నేను కెమెరా ముందే యాక్ట్ చేస్తాను, నిజ జీవితంలో కాదు" అంటూ రాశి వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో రాశి నిజంగా ఆదర్శంగా నిలుస్తున్నారు.