Varanasi Movie: వారణాసి మూవీపై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి

బిగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి

Update: 2026-02-04 13:43 GMT

Varanasi Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసి గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా పార్ట్-1, పార్ట్-2లుగా వస్తుందని గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి రాజమౌళి స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. మొదట రెండు భాగాలుగా చేయాలని భావించినప్పటికీ, కథాగమనం దృష్ట్యా చివరకు ఒకే పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు వెల్లడించారు. అయితే సినిమా నిడివి విషయంలో మాత్రం జక్కన్న తగ్గడం లేదు. దాదాపు 3 గంటల 20 నిమిషాల** సుదీర్ఘ నిడివితో ఈ చిత్రం వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది.

రుద్రగా సూపర్ స్టార్.. విలన్ ఎవరంటే..?

ఈ సినిమాలో మహేశ్ బాబు రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మహేశ్‌కు పోటీగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను అకాశానికి చేర్చింది.

భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి

వారణాసి చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది. పూర్తి స్థాయి ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఇది నిలవనుంది. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Tags:    

Similar News