Rakul Preet: స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ రిలాక్స్!
పూల్‌లో రకుల్ రిలాక్స్!;
Rakul Preet: బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ గత ఏడాది ఫిబ్రవరి 21న పెళ్లి చేసు కున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత ముంబైలోని బాంద్రాలో ఈ అందమైన జంట సొంత ఇంటిని నిర్మించుకుంది. అందు కోసం కోట్లాది రూపాయల బడ్జెట్ వెచ్చించింది. నిజంగా అదో విలాసాల మల్టీ స్టోరీడ్ బిల్డింగ్. అందులోని పై అంతస్తులో అందమైన స్విమ్మింగ్ పూల్, లివింగ్ రూమ్ ఏరియా, రూఫ్ టాప్ గార్డెన్ ప్రతిదీ ఎంతో సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఇది మోడ్రన్ డే డిజైనర్ లుక్‌తో అద్భుతమైన ఆర్కిటెక్చర్ నిర్మించారు. ఇక ఆ ఇంట్లో ఏ మూల చూసినా అందమైన ఆర్ట్ వర్క్ ఆకర్షిస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇచ్చేలా ఓపెన్ ప్లేస్ తో ఎంతో విశాలంగా కనిపిస్తుంది. తాను నిత్య జీవితంలో పనితో అలసిపోయినప్పుడు స్విమ్మిం గ్ పూల్‌లో రిలాక్స్ అవుతామని రకుల్ చెబుతోంది. రకుల్ సొంత ఇంటి సౌందర్యాన్ని ఆవిష్కరించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికి అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. రకుల్ చివరిగా భారతీ యుడు 2లో కనిపించింది. ఆ తర్వాత భారతీయుడు 3లో నటించాల్సి ఉంది.. కానీ దానికి సంబంధించిన అప్డేట్ ఏమీలేదు. అలాగే అజయ్ దేవగన్ సరసన దేదే ప్యార్ దే 2లోనూ నటిస్తోంది.