Buchi Babu’s Mind-Blowing Comments: పెద్ది' కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు.. బుచ్చిబాబు మైండ్ బ్లోయింగ్ కామెంట్స్

బుచ్చిబాబు మైండ్ బ్లోయింగ్ కామెంట్స్

Update: 2026-06-03 04:56 GMT

Buchi Babu’s Mind-Blowing Comments: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది! ఉప్పెన లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత, దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకుని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన విజువల్ వండర్.. ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో, దర్శకుడు బుచ్చిబాబు షేర్ చేసిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఆయన మేకోవర్ అస్సలు ఊహించని రేంజ్‌లో ఉండబోతోందట. విజయనగరం నేపథ్యంలో, 1985 కాలం నాటి కథతో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో.. చరణ్ ఒక పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ ‘పెద్ది’ జర్నీని మూడు దశలుగా చూపించబోతున్నారు. ఈ మూడు లుక్స్ కోసం ఏకంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో డిజైన్ చేసి చరణ్‌కు చూపిస్తే.. ఆయన అంతకంటే మైండ్ బ్లోయింగ్ రీతిలో తన బాడీని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారని బుచ్చిబాబు ఎంతో గర్వంగా చెప్పారు.

దర్శకుడు ఒక పవర్‌ఫుల్ లైన్ చెప్పారు.. "పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు! సినిమాలో రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమా కోసం చరణ్ ‘దంగల్’ మూవీ ట్రైనర్ దగ్గర, అలాగే తెలంగాణ పహిల్వాన్ల దగ్గర మూడు నుంచి నాలుగు నెలలు కఠినమైన కుస్తీ శిక్షణ తీసుకున్నారు.

అయితే, ఈ రియలిస్టిక్ రెజ్లింగ్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్‌కు చాలా గాయాలయ్యాయట. ఒక ఫైట్ సీన్‌లో చరణ్ కంటికి గాయమై రక్తం కారినప్పుడు.. “చిరంజీవి గారు ఎక్కడ తిడతారో” అని తనకు విపరీతమైన భయం వేసిందని బుచ్చిబాబు గుర్తుచేసుకున్నారు. ఆ రియల్ గాయం కెమెరాలో కూడా రికార్డ్ అయిందట.

ఇక సినిమాలో శివరాజ్‌కుమార్ చరణ్ గురువుగా కనిపిస్తుండగా.. జగపతిబాబు పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతోంది. జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. వీటన్నింటికీ తోడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేయడం ఖాయం. ఆల్రెడీ ఫైనల్ కాపీ చూసిన సుకుమార్ గారు.. సినిమా సెకండాఫ్ తన ఫేవరెట్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు.

Tags:    

Similar News