Ram Charan: రామ్ చరణ్‌కు షూటింగ్‌లో గాయం.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్.. పెద్ది సెట్స్‌లో అసలేం జరిగింది..?

ఆందోళనలో మెగా ఫ్యాన్స్.. పెద్ది సెట్స్‌లో అసలేం జరిగింది..?

Update: 2026-03-25 07:39 GMT

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను కలవరపెట్టే వార్త ఒకటి ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్ర చిత్రీకరణలో రామ్ చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే?

షూటింగ్‌లో భాగంగా ఒక కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, రామ్ చరణ్ కంటి సమీపంలో చిన్న గాయం అయినట్లు సమాచారం. అయితే, మెగా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. 2,3 రోజుల విశ్రాంతి తర్వాత చరణ్ తిరిగి సెట్స్‌లో జాయిన్ అవుతారని, ఆ వెంటనే ఒక ప్రత్యేక గీతాన్ని వచిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

పుట్టినరోజు కానుకకు డోకా లేదు..

ఈ శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ది చిత్రం నుండి టీజర్ లేదా గ్లింప్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజా గాయం కారణంగా అప్‌డేట్ మారుతుందేమో అని ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ బర్త్‌డే అప్‌డేట్‌పై ఈ గాయం ప్రభావం ఏమీ ఉండదని, ప్లాన్ చేసినట్లే మెగా ట్రీట్ ఉంటుందని చిత్ర వర్గాల బోగట్టా.

Tags:    

Similar News