Ram Gopal Varma: షోలే కంటే ధురంధర్-2 వంద రెట్లు గొప్ప మూవీ..ఆర్జీవీ సంచలన రివ్యూ

ఆర్జీవీ సంచలన రివ్యూ

Update: 2026-03-19 03:27 GMT

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాపై చేసిన కామెంట్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వర్మ, ఈ చిత్రం విషయంలో మాత్రం ఊహకందని రీతిలో స్పందించారు. ఇండియన్ సినిమా గర్వించే షోలే, మొఘల్-ఎ-ఆజమ్ వంటి సినిమాలను టీవీ సీరియల్స్‌తో పోల్చారు. ధురంధర్ మేకింగ్ వంద రెట్లు మెరుగ్గా ఉందని, ఇది సినిమాటిక్ హిస్టరీలోనే ఒక అద్భుతమని ఆయన కొనియాడారు. "ధురంధర్ 2లో కెమెరా యాంగిల్స్, లైటింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చూడటం అరుదు" అని మేకింగ్‌ను ప్రశంసించారు.

వర్మ ఏమన్నారంటే:

భారతీయ చలనచిత్ర చరిత్రలో ‘షోలే’ ఒక మైలురాయి అనుకుంటాం. కానీ నా దృష్టిలో ఈ 'ధురంధర్' ఆ సినిమా కంటే 100 రెట్లు గొప్పగా ఉంది. ఇక ‘మొఘల్-ఎ-ఆజమ్’ వంటి ఎపిక్ క్లాసిక్స్‌ కూడా ఈ సినిమా మేకింగ్ ముందు చిన్న పిల్లల టీవీ సీరియల్స్‌లా కనిపిస్తాయి."సినిమాలోని తీవ్రత, టెక్నికల్ వాల్యూస్ , దర్శకుడి విజన్ తనను అంతలా కట్టిపడేశాయని వర్మ వెల్లడించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ టాలెంట్‌ను ఆకాశానికెత్తేశారు. ఆర్జీవీ లాంటి దిగ్గజ దర్శకుడి నుండి ప్రశంసలు రావడంతో ధురంధర్ చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది."వర్మ ఇచ్చిన ఈ భారీ స్టేట్‌మెంట్‌తో ఇప్పుడు సినీ లవర్స్ అంతా 'అసలు ఆ సినిమాలో ఏముంది?' అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News