Ram Pothineni Turns Director: దర్శకుడిగా మారిన రామ్ పోతినేని.. సొంత బ్యానర్‌లో యాక్షన్ థ్రిల్లర్ షురూ..

యాక్షన్ థ్రిల్లర్ షురూ..

Update: 2026-06-29 14:27 GMT

Ram Pothineni Turns Director: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 23వ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి హీరో రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్న రామ్, మెగాఫోన్ పట్టడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో అంచనాలు అప్పుడే భారీగా పెరిగిపోయాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముహూర్తపు వేడుకకు ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ హాజరై మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ది లోన్ వోల్ఫ.. అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ది లోన్ వోల్ఫ్ జర్నీ బిగిన్స్ అనే క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి రామ్ తన మార్క్ ఎనర్జీతో ఒక పవర్‌ఫుల్ అండ్ గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్..

రామ్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఈ తొలి చిత్రానికి టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ప్రముఖ కెమెరామెన్ తిరు విజువల్స్ అందించనున్నారు. స్టార్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ హై-వోల్టేజ్ స్టంట్స్ డిజైన్ చేయనున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ డ్రామాలో రామ్ సరసన నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Tags:    

Similar News