Ramayana Update: రామాయణ్ అప్ డేట్... శూర్పణఖగా రకుల్!

శూర్పణఖగా రకుల్!;

Update: 2025-06-14 10:27 GMT

Ramayana Update: రణబీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్న సినిమా రామాయణ్ . నితీశ్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ కనిపించనుంది. సినిమాకు ఎంతో కీలకమైన ఈ పాత్ర కోసం మొదట ప్రియాంక చోప్రాను సంప్రదించారట మేకర్స్. కానీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్న ప్రియాంకకు డేట్స్ అడ్జస్ట్ చేయడం వీలుకాక ఒప్పుకోలేకపోయిందట. దీంతో ఈ పాత్ర కోసం పలువురినీ పరిశీలించిన మేకర్స్.. రకుల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఎంపిక చేసినట్టు సమాచారం. కన్నడ స్టార్ యశ్ ఇందులో రావణుడిగా నటి స్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. దక్షిణా ది చిత్రాల్లో గ్యాప్ తీసుకున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం అభిమాను లకు అందుబాటులో ఉంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకటి, రెండు ప్రాజెక్టులే ఆమె చేతిలో ఉన్నాయి. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారు. ఇందులో సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్‌.. చివరగా మేరే హజ్బెండ్‌ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్‌ 3, దేదే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.

Tags:    

Similar News