OTT: రానా నాయుడు 2..మరింత వైల్డ్ గా.

రానా మరింత వైల్డ్ గా;

Update: 2025-06-04 04:03 GMT

OTT: వెంకటేష్, రానా కలిసి నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. రెండేళ్ల క్రితం నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో విడుదలైన ఈ సిరీస్‌‌‌‌కు యూత్‌‌‌‌నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సిరీస్‌‌‌‌కు సీక్వెల్‌‌‌‌గా ‘రానా నాయుడు 2’ను రూపొందించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌‌‌‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేశారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. జూన్ 13 నుంచి నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

జూన్ 3న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్‌‌‌‌కు మించిన ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్, థ్రిల్‌‌‌‌ను చూపించబోతున్నట్టు ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా కట్ చేసిన ట్రైలర్ సిరీస్‌‌‌‌పై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇందులో నాగ నాయుడు 2.0గా వెంకటేష్ కనిపించారు. ఈ సారి అన్నీ జాగ్రత్తలు తీసుకునే సీజన్ 2 తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ ట్రైలర్‌ కట్‌లో బోల్డ్‌ సీన్స్‌ లేవు. మొత్తం యాక్షన్‌ డ్రామాగా రానున్నట్టు ట్రైలర్ కట్ చేశారు. నాగా నాయుడి పాత్రలో వెంకటేష్‌ చాలా అద్భుతంగా మెప్పించాడు. సూర్వీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Tags:    

Similar News