Ranveer Singh: రణ్ వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రణ్‌వీర్ సింగ్ సుమారు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ గ్యాంగ్ హెచ్చరించినట్లు సమాచారం.రణ్‌వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్‌కు ఒక వాయిస్ నోట్ (Voice Note) వచ్చింది. ఇది అమెరికాకు చెందిన ఒక నంబర్ నుండి పంపబడింది.తనను తాను బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకుంటున్న 'హ్యారీ బాక్సర్' (Harry Boxer) అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం రణ్‌వీర్‌నే కాకుండా, అతని దగ్గర పనిచేసే మేనేజర్లు, వ్యక్తిగత సిబ్బంది వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని, వారిని కూడా టార్గెట్ చేస్తామని ఆ ఆడియోలో పేర్కొన్నారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వాయిస్ నోట్ నిజమైనదా లేక AI ఉపయోగించి సృష్టించబడిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. బెదిరింపుల నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ నివాసం వద్ద ముంబై పోలీసులు భద్రతను పెంచారు. రణ్‌వీర్ కూడా తన సొంత సెక్యూరిటీని పెంచుకున్నట్లు సమాచారం.రణ్‌వీర్‌తో పాటు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇవే తరహా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.గతంలో సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్, ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ వంటి ఇతర స్టార్లను కూడా బెదిరిస్తుండటంతో బాలీవుడ్‌లో రక్షణపై ఆందోళన మొదలైంది.